ఆయన చాలా కేరింగ్ పర్సన్.. చాహల్ కు మహ్ వశ్ కితాబు
--
ఈనేపథ్యంలోనే మహ్ వశ్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాహల్ పై ప్రశంసల జల్లు కురిపించింది. చాహల్ చాలా కేరింగ్ పర్సన్ అని, ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రేమించిన వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడని చెప్పుకొచ్చారు. చాహల్ చాలా మంచివాడు, వినయపూర్వకంగా ఉంటాడని మహ్ వశ్ వివరించారు. చాహల్ లో ఉన్న ఈ ప్రత్యేక లక్షణాలను అందిపుచ్చుకోవాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. మహ్ వశ్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలతో చాహల్ తో ఆమె బంధంపై మరోసారి చర్చ జరుగుతోంది.