సరిహద్దుల్లో హై టెన్షన్... ఐపీఎల్ మ్యాచ్ మధ్యలోనే నిలిపివేత
కాగా, సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో... ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ను మధ్యలోనే నిలిపివేశారు. ఐపీఎల్ మ్యాచ్ అర్ధంతరంగా రద్దు కావడం ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితులకు అద్దం పడుతోంది.
మ్యాచ్ ను అధికారులు నిలిపివేసే సమయానికి పంజాబ్ కింగ్స్ 10.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది.