సన్ రైజర్స్ కు డూ ఆర్ డై మ్యాచ్... ఓడితే ఇంటికే!
- ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ
- ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
సొంత మైదానం అనుకూలతతో బరిలోకి దిగుతున్న సన్‌రైజర్స్ కు ఇది చావో రేవో మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఓడిపోతే సన్ రైజర్స్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అందుకే గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతోంది. టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 3 విజయాలతో 9వ స్థానంలో ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు గల్లంతు కాగా, ఇవాళ్టి మ్యాచ్ లో గెలిస్తే, ఏ మూలో కాస్తంత చాన్స్ ఉంటుంది.
మరోవైపు, అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్ లు ఆడి 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఆ జట్టు మరో రెండు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ బెర్తు అవకాశాలు మెరుగవుతాయి.