Nithin: ఫైనల్‌గా ఆ రోజు 'తమ్ముడు' వస్తున్నాడు!

- నితిన్ 'తమ్ముడు' విడుదల తేదీ ప్రకటన
- ఆకట్టుకున్న రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియో
- జూలై 4న 'తమ్ముడు' విడుదల
గత కొంతకాలంగా సరైన కమర్షియల్ విజయం కోసం ఎదురుచూస్తున్న హీరో నితిన్ తన ఆశలన్నీ 'తమ్ముడు'పైనే పెట్టుకున్నాడు. ఈ చిత్రం తనకు మళ్లీ సక్సెస్ ట్రాక్‌ను ఎక్కిస్తుందని నమ్మకంతో ఉన్నాడు. అయితే గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 4న విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ఆదివారం ఓ వీడియో రూపంలో అధికారికంగా ప్రకటించింది.
ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్‌లో, క్రియేటివ్ వీడియోస్‌లో దర్శకులు ఎంతో ఎనర్జీగా పాల్గొంటున్నారు. ఈ కోవలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ వీడియోను కూడా క్రియేటివ్‌గా డిజైన్ చేశారు. ఈ వీడియోలో యాక్టర్స్ స్వసిక విజయన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, లయ, బేబి శ్రీరామ్ దీత్య ఒక్కొక్కరుగా డైరెక్టర్ శ్రీరామ్ వేణు దగ్గరకు వస్తారు. వీళ్లు తనకు బర్త్ డే విషెస్ చెప్పేందుకు వచ్చారని శ్రీరామ్ వేణు అనుకోగా...వాళ్లు మాత్రం "తమ్ముడు" సినిమా రిలీజ్ ఎప్పుడు? ప్రమోషన్ ఎప్పుడు బిగిన్ చేస్తారు? అని అడుగుతారు.
వర్ష బొల్లమ్మ తన ప్రమోషన్ తానే చేసుకుంటున్నానని, తన మీమ్స్ కూడా తానే వేసుకుంటున్నానని, రిలీజ్ డేట్ చెప్పండి సార్.. అని అడుగుతుంది. ఇక లయ విషయానికొస్తే "తన పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు, రిలీజ్ డేట్ చెప్పడం లేదు... అసలీ సినిమాలో నేను యాక్ట్ చేశానా, లేదా?" అని అడుగుతుంది. చివరలో బేబి శ్రీరామ్ దీత్య కూడా "నేను థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు మూవీ స్టార్ట్ చేశారు, ఇప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా, మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు?" అని అడుగుతుంది.
దీంతో డైరెక్టర్ శ్రీరామ్ వేణు వాళ్లకు ఏం చెప్పాలో తెలియక మీకు ఇన్ఫామ్ చేస్తానంటూ పంపిస్తారు. చివరలో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ శ్రీరామ్ వేణు బర్త్ డే కేక్ కట్ చేయడంతో పాటు జూలై 4న 'తమ్ముడు' మూవీ రిలీజ్ అంటూ ప్రకటిస్తారు.