ల‌క్నో కెప్టెన్ పంత్‌కు భారీ జ‌రిమానా... కార‌ణ‌మిదే!

28-04-2025 Mon 12:29 | Sports
Advertisement
  • ఎల్ఎస్‌జీ కెప్టెన్ రిషభ్‌ పంత్‌కు రూ.24 లక్షల జరిమానా
  • ఈ సీజ‌న్‌లో ల‌క్నో రెండోసారి స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదు 
  • జ‌ట్టులో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా ప్లేయింగ్ ఎలెవెన్‌లోని అంద‌రికీ ఫైన్‌
Advertisement
ఆదివారం వాంఖ‌డే వేదిక‌గా ముంబ‌యి ఇండియన్స్ (ఎంఐ)తో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్  కార‌ణంగా లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) కెప్టెన్ రిషభ్‌ పంత్‌కు రూ.24 లక్షల జరిమానా ప‌డింది. ఈ సీజ‌న్‌లో ల‌క్నో రెండోసారి స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదు చేయ‌డంతో కెప్టెన్‌కు ఐపీఎల్ కౌన్సిల్‌ భారీ ఫైన్ వేసింది. అలాగే జ‌ట్టులో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా అంద‌రూ రూ. 6ల‌క్ష‌లు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జ‌రిమానాగా చెల్లించాల‌ని ఆదేశించింది. 

"కనీస ఓవర్ రేట్ త‌ప్పిదాల‌కు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఈ సీజన్‌లో ల‌క్నో జట్టు రెండోసారి స్లో ఓవ‌ర్ రేట్‌ను న‌మోదు చేసింది. అందుకే పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించబడింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్‌ సహా ప్లేయింగ్ ఎలెవెన్‌లోని మిగిలిన సభ్యులకు రూ. 6లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఏది తక్కువైతే అది జరిమానాగా చెల్లించాలి" అని ఐపీఎల్ కౌన్సిల్ త‌న‌ ప్రకటనలో పేర్కొంది.

ఇక, ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు 54 పరుగుల భారీ తేడాతో లక్నోను చిత్తు చేసిన విష‌యం తెలిసిందే. ఎంఐ నిర్దేశించిన 216 పరుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఎల్ఎస్‌జీ 161 పరుగులకు ఆలౌట్ అయింది.
Advertisement
Rishabh PantIPL 2025Lucknow Super GiantsMumbai IndiansSlow Over RateIPL FineCricket NewsSports NewsIndiaIPL 2025 Fine

More Telugu News

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52
..more