కాసేపట్లో మోదీతో జేడీ వాన్స్ భేటీ.. ఏపీకి తెలుగు అల్లుడి రాక డౌటే!

21-04-2025 Mon 19:54 | National
Advertisement
  • ఢిల్లీలో కుటుంబ సమేతంగా ల్యాండ్ అయిన అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్
  • కాసేపట్లే మోదీతో భేటీ కానున్న వాన్స్
  • అత్యంత కీలకంగా మారబోతున్న ఉభయ నేతల సమావేశం
Advertisement
అమెరికా వైస్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ అల్లుడు జేడీ వాన్స్ మన భరత గడ్డపై కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా ఈ ఉదయం ఢిల్లీలో ఆయన ల్యాండ్ అయ్యారు. కాసేపట్లో ఆయన భారత ప్రధాన మోదీని కలవనున్నారు. అత్యున్నతమైన ఈ భేటీలో మోదీ, వాన్స్ పలు అంశాలపై చర్చించనున్నారు. 

అధికారికంగా అందుతున్న సమాచారం మేరకు మోదీ, వాన్స్ ఇప్పటికే నిర్ధారితమైన ఉభయ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చించనున్నారు. అంతిమంగా ఈ చర్చలు ఉభయ దేశాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసేలా ఉండబోతున్నాయి. 

అమెరికా ఉపాధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోదీ విందును ఇవ్వబోతున్నారు. ప్రధాని మోదీకి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మధ్య బలమైన స్నేహ సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రంప్ ప్రారంభించిన ట్రేడ్ వార్ కారణంగా ఇప్పటికే ప్రపంచం రెండు ముక్కలయిందనేది అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయం. యూరోపియన్ యూనియన్ కూడా ట్రంప్ ధోరణిపై గుర్రుగా ఉంది. ప్రపంచ ఆధిపత్యం కోసం ఎదురు చూస్తున్న చైనా... ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థతుల్లో అమెరికాకు భారత్ మద్దతు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్ భారత్ పర్యటన అటు అమెరికాకు, ఇటు ఇండియాకు అత్యంత కీలకం కాబోతోంది.

జేడీ వాన్స్ భార్య ఉష మన తెలుగు మహిళ అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన కుటుంబంలో ఆమె జన్మించారు. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ అయ్యారు. యూనివర్సిటీలో చదువుకునే సమయంలో ఉషకు వాన్స్ పరిచయం అయ్యారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి... చివరకు ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మన తెలుగింటి అల్లుడు మన దేశానికి రావడం మనం సంతోషించాల్సిన విషయం. మరోవైపు వాన్స్ షెడ్యూల్ ప్రకారం చూస్తే... ఈ దంపతులు ఏపీకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
Advertisement
Kamala HarrisJD VanceIndia-US RelationsModi-Vance MeetingUS Vice PresidentIndia VisitBilateral TalksTrade DealAndhra PradeshTeluguKamala Harris Husband

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more