ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత లేఖ
- మెగా డీఎస్పీ నోటిఫికేషన్ పై హర్షం
- వయోపరిమితి పెంచాలని అభ్యర్థన
- వేగంగా పూర్తిచేయాలని కోరిన సీపీఐ నేత
2018 తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని రామకృష్ణ తన లేఖలో గుర్తుచేశారు. అప్పటి నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు వేచి చూస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో అభ్యర్థుల్లో వయోపరిమితిపై ఆందోళన నెలకొందని చెప్పారు. వయోపరిమితి 47 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని, మెగా డీఎస్సీ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని రామకృష్ణ తన లేఖలో సీఎం చంద్రబాబును కోరారు.