వైభవ్ ఆటతీరుకు ఫిదా అయిన గూగుల్ సీఈవో
––
ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వైభవ్, తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే, వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా రాజస్థాన్ రాయల్స్‌కు విజయం దక్కలేదు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు కేవలం 2 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలైంది. చివరి ఓవర్లలో లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు, ఆఖరి ఓవర్లో 9 పరుగులను కాపాడి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది.