బాలయ్య వాహనానికి ఫ్యాన్సీ నంబర్.. వేలంలో 7.75 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్న నటుడు

Balakrishna Buys Fancy Car Number for 775 Lakhs
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన కారు కోసం ఫ్యాన్సీ నంబర్ దక్కించుకున్నారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో నిన్న నిర్వహించిన వేలంలో రూ. 7.75 లక్షలు చెల్లించి టీజీ09ఎఫ్0001 నంబర్‌ను సొంతం చేసుకున్నారు. బాలయ్య త్వరలోనే రిజిస్టర్ చేసుకోనున్న తన బీఎండబ్ల్యూ వాహనం కోసం ఈ నంబర్‌ను తీసుకున్నారు. 

ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఒక్క ఖైరతాబాద్ జోన్‌లోనే రవాణాశాఖకు ఒక్క రోజులో రూ. 37,15,645 ఆదాయం సమకూరింది. మిగతా ఫ్యాన్సీ నంబర్లలో ఎఫ్ 0099 నంబర్‌ను కాన్కాప్ ఎలక్ట్రికల్స్ సంస్థ 4,75,999కి సొంతం చేసుకుంది. టీజీ09ఎఫ్0009 నంబరును కమలాలయ హైసాఫ్ట్ సంస్థ దక్కించుకోగా, ఎఫ్ 0005 నంబర్‌ను జెట్టి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ రూ. 1,49,999కి, ఎఫ్ 0007 నంబర్‌ను శ్రీనివాసనాయుడు రూ. 1,37,779కి, ఎఫ్ 0019 నంబర్‌ను నేత్రావతి బలగప్ప శివలిప్ప రూ. 60 వేలకు సొంతం చేసుకున్నారు. కాగా, గత సిరీస్‌లోని టీజీ09ఈ999 నంబర్‌ను ఈకో డిజైన్ స్టూడియో రూ.99,999కి సొంతం చేసుకుంది.
Go Back to Shorts
Nandamuri Balakrishna
Balakrishna Fancy Number
Vehicle Registration
Hyderabad RTO Auction
Fancy Number Auction
TG09F0001
BMW Car
High-Value Registration
Telugu Actor
Andhra Pradesh RTO

More Telugu News