వాంఖడే స్టేడియంలోని స్టాండ్ కు తన పేరు పెట్టడంపై రోహిత్ శర్మ స్పందన
- స్టాండ్ కు తన పేరు పెట్టడాన్ని నమ్మలేకపోతున్నానన్న రోహిత్
- తన జీవితంలో ఇది అతి పెద్ద గౌరవం అన్న హిట్ మ్యాన్
- స్టాండ్ పై తన పేరు చూసుకున్నప్పుడు భావోద్వేగం కలుగుతుందన్న రోహిత్
తాను వాంఖడే స్టేడియంలోకి ప్రవేశించిన తొలి రోజు నుంచి అదే స్టేడియంలో ఒక స్టాండ్ కు తన పేరు పెట్టేంత వరకు జీవితంలో ఎన్నో జరిగాయని రోహిత్ అన్నాడు. అజాద్ గ్రౌండ్ లో తాము అండర్ 14, అండర్ 16 ట్రైనింగ్ పూర్తి చేసుకుని రంజీ క్రికెటర్లను చూసేందుకు వాంఖడేకి వెళ్లేవాళ్లమని తెలిపాడు. అప్పట్లో వాంఖడేలోకి వెళ్లడం ఎంత కష్టమో తనకు తెలుసని చెప్పాడు. ఆ రోజులను ఎప్పుడూ గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. తన తొలి గేమ్ ను వాంఖడేలోనే ఆడానని... ఆ తర్వాత ఎన్నో మరుపురాని మ్యాచ్ లు ఆడానని చెప్పాడు.