బోరుగడ్డ బెయిల్ పిటిషన్ విచారణను తోసిపుచ్చిన హైకోర్టు

18-04-2025 Fri 08:13 | Andhra
Advertisement
  • ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్
  • తల్లికి అనారోగ్యం పేరుతో మధ్యంతర బెయిల్
  • ఈ సందర్భంగా సమర్పించిన డాక్టర్ సర్టిఫికెట్ నకిలీదని తేలిన వైనం
  • జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద వైద్యుడి వాంగ్మూలాన్ని నమోదు చేయించాలని ఆదేశం
Advertisement
గుంటూరుకు చెందిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిలు వ్యవహారంపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ కుమార్ తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని మెడికల్ సర్టిఫికెట్ చూపించి మధ్యంతర బెయిలు పొందాడు. అయితే, అది నకిలీ సర్టిఫికెట్ అని గుర్తించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ సర్టిఫికెట్‌‌పై గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యుడు పీవీ రాఘవశర్మ సంతకం ఉండటంతో పోలీసులు ఆయనను విచారించారు. అయితే, ఆ సంతకం తనది కాదని, తాను ఆ సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆయన వాంగ్మూలం ఇచ్చారు. 

నకిలీ సర్టిఫికెట్ వ్యవహారంపై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైద్యుడు డాక్టర్ రాఘవశర్మ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంతో బోరుగడ్డ విభేదించాడు. ఈ నేపథ్యంలో జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద వైద్యుడి వాంగ్మూలాన్ని నమోదు చేయించి తమకు పంపాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే)ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు, బెయిలు పిటిషన్‌పై విచారణ జరపాలన్న బోరుగడ్డ తరపు న్యాయవాది అభ్యర్థనను హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు తోసిపుచ్చారు.
Advertisement
Borugadda Anil KumarForgery CaseBail PetitionAndhra Pradesh High CourtGunturFake Medical CertificateJustice T. Mallikarjuna RaoPV Raghava SharmaRajamahendravaram Central PrisonRowdy Sheeter

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more