లిక్కర్ కేసు... సిట్ విచారణకు డుమ్మా కొట్టిన విజయసాయిరెడ్డి
- ఈరోజు విచారణకు వస్తానని సిట్ అధికారులకు తెలిపిన విజయసాయిరెడ్డి
- విజయసాయి విచారణ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన సిట్ అధికారులు
- తాను ఈరోజు విచారణకు రావడం లేదని సమాచారం పంపిన విజయసాయి
విజయసాయి విచారణ కోసం విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫీస్ లోని సిట్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సీపీ కార్యాలయం ఎదుట కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సిట్ విచారణ బృందం కూడా అక్కడకు చేరుకుంది. మధ్యాహ్నం అయినప్పటికీ విజయసాయి అక్కడకు చేరుకోలేదు. విచారణకు విజయసాయి డుమ్మా కొట్టారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఈరోజు విచారణకు హాజరుకాలేక పోతున్నానని సమాచారం పంపారు. విచారణకు ఎప్పుడు వస్తాననేది తెలియజేస్తానని చెప్పారు.
మరోవైపు మద్యం కేసులో గతంలో సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా మీడియాతో విజయసాయి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం అంతా కసిరెడ్డి కనుసన్నల్లోనే నడిచిందని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా అధికారులకు అందిస్తానని చెప్పారు.