నీచ రాజకీయాల కోసం కాంగ్రెస్, డీఎంకే రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయి: ప్రధాని మోదీ

Narendra Modi Slams Congress DMK for Blocking Women Reservation Bill
  • మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్న మోదీ
  • దురదృష్టవశాత్తు ఫలితం లేకుండా పోయిందని వ్యాఖ్య
  • సాధారణ కుటుంబాల సోదరీమణులు పార్లమెంటుకు రావాలని కోరుకున్నానని వ్యాఖ్య
కాంగ్రెస్, డీఎంకే, వాటి మిత్ర పక్షాలు నీచ రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో అడ్డుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఎన్డీయే ప్రభుత్వం ఎంతో కృషి చేసినప్పటికీ దురదృష్టవశాత్తూ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోయంబత్తూరులో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ద్వారా తమిళనాడు రాష్ట్రానికి మరిన్ని లోక్ సభ స్థానాలు రావాల్సి ఉండగా, డీఎంకే దానిని అడ్డుకుందని మండిపడ్డారు. తమిళనాడుకు మరిన్ని సీట్లు రావాలని డీఎంకే కోరుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

సాధారణ కుటుంబాల సోదరీమణులూ పార్లమెంటుకు రావాలని తాను కోరుకున్నానని అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ, ఆ క్రెడిట్‌ను ప్రతిపక్షాలే తీసుకోవాలని కూడా తాను సూచించానని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. కాగా, లోక్ సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Narendra Modi
Congress
DMK
Women Reservation Bill
Tamil Nadu Elections
Coimbatore
Lok Sabha Seats

More Telugu News