అమెరికా దిగ్బంధనం... సూపర్ ట్యాంకర్ భారత్ చేరుకుందని హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ ట్వీట్
- 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో 'డోర్నా' దక్షిణ తీరానికి చేరుకుందని వెల్లడి
- అమెరికా హర్మూజ్ దిగ్బంధనానికి ముందే ఇరాన్ నుంచి బయలుదేరిందని వెల్లడి
- విజయవంతంగా భారత్ చేరుకున్నట్లు పేర్కొన్న ఇరాన్ కాన్సులేట్
ఇదిలా ఉండగా, అమెరికా ఆంక్షలు, నావికాదళం గస్తీ నడుమ కూడా వారం రోజుల వ్యవధిలో భారత్‌కు మూడు విడతల్లో దాదాపు 6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు వచ్చింది. ప్రస్తుతం దక్షిణ తీరానికి చేరుకున్న డోర్నా నౌక సమీపంలోని స్థానిక రిఫైనరీకి సుమారు 20 లక్షల బ్యారెళ్ల చమురును అందజేయనున్నట్లు తెలుస్తోంది.