అనకాపల్లి జిల్లాలో బాణసంచా కర్మాగారంలో పేలుడు... ఆరుగురి మృతి
- కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా కర్మాగారంలో పేలుడు
- గాయపడిన వారిని నర్సీపట్నం ఆసుపత్రికి తరలింపు
- ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, అధికారులు
ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. ఈ మధ్యాహ్నం జరిగిన పేలుడుతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి పలు నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి.