బలవంతంగా ఆలయంలోకి మూక.. గేట్లు తెరవలేదని పూజారిపై దాడి
- మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఘటన
- అర్ధరాత్రి 10 కార్లతో కాన్వాయ్‌గా వచ్చిన జితు రఘువంశీ
- ఈ సమయంలో గేట్లు తెరవడం సాధ్యం కాదన్నందుకు పూజారిపై దాడి.. చంపేస్తామని బెదిరింపు
అర్ధరాత్రి కావడంతో ఆలయ తలుపులు మూసివేశామని, 30 మందితో కలిసి జితు రఘువంశీ అర్ధరాత్రి 12.40 గంటలకు ఆలయానికి వచ్చారని పూజారి తెలిపారు. ఆలయ తలుపులు మూసివేశామని, ఇప్పుడు తెరవడం కుదరదని చెప్పినా వినకుండా బలవంతంగా తనతో గేట్లు తెరిపించారని, ఆ తర్వాత తనను లాగిపడేసి కొట్టారని, చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. ఆ తర్వాత లోపల వారు పూజలు చేశారని పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు అయిందని, ఆలయ ఆవరణలో ఉన్న 50 సీసీటీవీలను పరిశీలిస్తున్నామని సిటీ ఎస్పీ దినేశ్ అగర్వాల్ తెలిపారు. జితు రఘువంశీ బీజేపీ నేత కుమారుడా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.