జూన్ వరకు ఎండలే ఎండలు!

01-04-2025 Tue 07:07 | Telangana
Advertisement
  • ఈసారి వేసవిలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు
  • వడగాలులు కూడా ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం
  • నిన్న ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు!
Advertisement
ఈసారి వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఏప్రిల్-జూన్ మధ్య ఈసారి సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని వివరించింది. రాబోయే మూడు నెలలపాటు అనేక ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని, సాధారణం కంటే రెండు నుంచి నాలుగు రోజులు ఎక్కువగా వడగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మామూలుగానైతే ఈ మూడు నెలల్లో నాలుగు నుంచి ఏడు రోజుల వరకు వడగాలులు నమోదవుతుంటాయి. ఈసారి ఇవి మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, యూపీ, హర్యానా, బీహార్, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెలలో దేశంలోనే పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు.

ఇక, వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నేడు, రేపు, ఎల్లుండి చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి, ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా, నిన్న ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 2.4 డిగ్రీలు అధికం.
Advertisement
IMD Heatwave WarningIndia HeatwaveSummer TemperaturesTelangana WeatherAndhra Pradesh WeatherHeatwave ForecastExtreme HeatWeather UpdateHigh Temperatures

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more