ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేశ్

31-03-2025 Mon 18:39 | Andhra
Advertisement
  • అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు 14 కి.మీ. పొడవైన రోడ్డు విస్తరణ 
  • నేడు శంకుస్థాపన చేసిన నారా లోకేశ్
  • యువగళం పాదయాత్ర సమయంలో స్థానిక ప్రజల విజ్ఞప్తి 
  • వారి వినతిని గుర్తుంచుకుని నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన లోకేశ్ 
  •  రూ.347 కోట్ల వ్యయంతో రోడ్డు విస్తరణ 
Advertisement
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు సుమారు 14 కి.మీ. పొడవైన రోడ్డు విస్తరణ పనులకు నేడు శంకుస్థాపన చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో ఈ ప్రాంత ప్రజలు రహదారి విస్తరణ చేపట్టాలని లోకేశ్ కు విన్నవించారు. ఆనాడు లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు... ప్రస్తుతం డబుల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని రూ.347 కోట్లతో 4 లేన్ల రహదారిగా విస్తరించనున్నారు. 

రెండేళ్ల కాలవ్యవధిలో చేపట్టే ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా అచ్యుతాపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ తోపాటు రెండు మైనర్ బ్రిడ్జిలు, 47 కల్వర్టులు నిర్మిస్తారు. ఈ ప్రాంతం విశాఖ-చెన్నయ్ ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC), జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీ, స్పెషల్ ఎకనమిక్ జోన్ లో భాగంగా రాంబిల్లి, అచ్యుతపురం, పరవాడ వద్ద అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక క్లస్టర్లకు దగ్గరగా ఉంది. దీంతో భవిష్యత్ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈరోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. 

ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్ రోడ్డు అనకాపల్లి సమీపంలోని NH-16 జంక్షన్ వద్ద ప్రారంభమై అచ్యుతాపురం వద్ద ముగుస్తుంది. ఈ రహదారి హరిపాలెం రోడ్డు, పూడిమడక రోడ్డు వెంబడి నివాసాలు, పారిశ్రామిక సంస్థలు, మత్స్యకార గ్రామాలకు ప్రధాన కనెక్టివిటీని అందిస్తుంది. ఇది అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో 5595.47 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న APSEZ కు ప్రధాన కనెక్టివిటీని అందిస్తుంది. అనకాపల్లి సమీపాన నక్కపల్లి వద్ద ఆర్సెలర్ మిట్టల్ సంస్థ రూ.1.4లక్షల కోట్లతో కొత్తగా నిర్మించతలపెట్టిన స్టీల్ ప్లాంట్ కు కూడా కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. 

ఈ రహదారి APSEZ, 180 పరిశ్రమల చుట్టూ ఉన్న ఇతర కీలక పారిశ్రామిక ప్రాంతాలను జిల్లా ప్రధాన కార్యాలయానికి అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగుల రోజువారీ రాకపోకలను సులభతరం చేస్తుంది. అచ్యుతాపురం, మునగపాక, అనకాపల్లి మండల నివాసితులకు ట్రాఫిక్ కష్టాలను తగ్గిస్తుంది. 
Advertisement
Nara LokeshAndhra PradeshRoad ExpansionAnkapalleAchyutapuramVisakhapatnam-Chennai Industrial CorridorAPSEZInfrastructure DevelopmentRoad ProjectArcelorMittal

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more