టాలీవుడ్ లో విషాదం... పలు చిత్రాలను నిర్మించిన ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత
- తెలుగులో పలు చిత్రాలను నిర్మించిన ముళ్లపూడి బ్రహ్మానందం
- నిన్న రాత్రి 9 గంటల సమయంలో కన్నుమూత
- ఆస్ట్రేలియా నుంచి కుమారుడు వచ్చిన తర్వాత బుధవారం అంత్యక్రియలు
ముళ్లపూడి బ్రహ్మానందం కుమారుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఆయన వచ్చిన తర్వాత బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య మంగాయమ్మ, కుమారుడు సతీశ్, కూతురు మాధవి ఉన్నారు. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు ముళ్లపూడి బ్రహ్మానందం బావ అవుతారు. ఈవీవీ సోదరిని ఆయన పెళ్లి చేసుకున్నారు. తెలుగులో ముళ్లపూడి పలు చిత్రాలను నిర్మించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.