ప్రాణాలకు తెగించి పసికందులను కాపాడిన నర్సులు.. వీడియో ఇదిగో!
- మయన్మార్ పెను భూకంపానికి పక్కనే ఉన్న చైనాలోనూ ప్రకంపనలు
- భూకంపం ధాటికి అల్లల్లాడిన చైనా ఆసుపత్రి
- అప్పుడే పుట్టిన పసికందులను ఉంచిన వార్డులో భయానక పరిస్థితి
సరిగ్గా నిలబడలేని పరిస్థితిలో కూడా నర్సులు పిల్లల స్ట్రోలర్లు కదలకుండా పట్టుకున్నారు. ఓ నర్సు శిశువును ఎత్తుకుని, స్ట్రోలర్ లో ఉన్న మరో శిశువును కాపాడటానికి ప్రయత్నించడం, మరొక నర్సు నాలుగు స్ట్రోలర్లను పట్టుకుని నిలబడడం ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ నర్సుల అంకిత భావానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో తమను కదిలించిందని, మనుషుల్లో రాక్షసత్వం పెరిగిపోతున్న ఈ రోజుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందని ఈ వీడియో చూస్తే తెలుస్తోందని కామెంట్లు పెడుతున్నారు.