టీడీపీని లేకుండా చేయాలనుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు: చంద్రబాబు

29-03-2025 Sat 14:37 | Andhra
Advertisement
  • నేడు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం
  • మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో వేడుకలు
  • హాజరైన పార్టీ అధినేత చంద్రబాబు
  • పార్టీకి మనం అందరం వారసులం... నేను టీమ్ లీడర్ మాత్రమే అన్న చంద్రబాబు
Advertisement
నేడు (మార్చి 29) తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జాతీయ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ శ్రేణులకు ప్రత్యేక సందేశం వెలువరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన వేడుకలకు చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర హోంమంత్రి అనిత, ఇతర నేతలు పార్టీ జెండాను ఎగురవేసి, ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... ఒక మహనీయుడి విజన్ కు ప్రతిరూపమే తెలుగుదేశం పార్టీ అని అభివర్ణించారు. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ... పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. అనేక విప్లవాత్మక పథకాలతో పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అటువంటి చారిత్రాత్మక పార్టీకి మనందరం వారసులం... నేను టీమ్ లీడర్ ను మాత్రమే అని చంద్రబాబు స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చాలామంది చాలా ప్రయత్నాలు చేశారని, అలాంటి వాళ్లందరూ కాలగర్భంలో కలిసిపోయారని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా... టీడీపీని ఏమీ చేయలేకపోయారని, పార్టీ పెట్టిన ముహూర్త బలం అటువంటిది అని అన్నారు. చరిత్రలో టీడీపీ నాటి స్వర్ణయుగం అనే రోజులు శాశ్వతంగా వస్తాయని పేర్కొన్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 

"2024 ఎన్నికలు ఒక చరిత్రను సృష్టించాయి. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని నిలబెట్టాలన్న ఆలోచనతో కూటమిగా ఏర్పడ్డాం. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అఖండ విజయాన్ని సాధించాం. 93 శాతం స్ట్రయిక్ రేట్ తో అద్భుత విజయం నమోదు చేశాం. ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు ఎదురైనా కార్యకర్తలు ధైర్యాన్ని వీడలేదు. నేతలను, పార్టీని ఆర్థికంగా దెబ్బతీసి కుంగదీయాలని ఎన్నో కుట్రలు పన్నారు. ఆస్తులు విధ్వంసం చేసినా ఎవరికీ భయపడలేదు. ప్రతి కార్యకర్త త్యాగాన్ని గుర్తుంచుకుంటాం. కార్యకర్తలు హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటమి అనేదే ఉండదు" అని చంద్రబాబు పేర్కొన్నారు.
Advertisement
Chandrababu NaiduTDPTelugu Desam Party43rd AnniversaryNara LokeshAndhra Pradesh PoliticsIndian PoliticsParty Foundation DayNT Rama RaoElection 2024

More Telugu News

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03
..more