రష్యా ప్రెసిడెంట్ పుతిన్ పై జెలెన్ స్కీ షాకింగ్ కామెంట్స్
- పుతిన్ త్వరలో చనిపోతారని జోస్యం
- అనారోగ్యంతో బాధపడుతున్నాడని తమకు సమాచారం ఉందన్న జెలెన్ స్కీ
- ఆయన మరణంతోనే యుద్ధం ఆగుతుందని వ్యాఖ్య
జెలెన్ స్కీ ఇంకా ఏమన్నారంటే..
"పుతిన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. త్వరలో ఆయన మరణిస్తారు. ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుంది. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనడం రష్యాకు ఇష్టం లేదు. యుద్ధం ఆపేయాలని రష్యాపై ఒత్తిడి తీసుకురావాలి" అని జెలెన్ స్కీ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.
కాగా, అమెరికా ప్రతిపాదించిన పాక్షిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ విషయంలో రష్యాను ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అమెరికా ప్రతినిధులు సౌదీ అరేబియా వేదికగా రష్యాతో చర్చలు జరుపుతున్నారు.