కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదో ప్రపంచ వింత అని ప్రచారం చేయించారు: బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్
- కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆరే ఇంజినీర్ అని విమర్శ
- మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- లూజ్ సాయిల్, లూజ్ ఫౌండేషన్ మీద కాళేశ్వరాన్ని నిర్మించడం తప్పన్న బీజేపీ ఎమ్మెల్యే
లూజ్ సాయిల్, లూజ్ ఫౌండేషన్ మీద కాళేశ్వరాన్ని నిర్మించడం పెద్ద తప్పని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్, హరీశ్ రావును క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి శీల పరీక్ష నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.