మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం

26-03-2025 Wed 11:17 | National
Advertisement
  • మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న సీబీఐ
  • రాయ్ పూర్, భిలాయ్ లోని భూపేశ్ భాఘెల్ నివాసాల్లో తనిఖీలు
  • కాంగ్రెస్ పార్టీ నేతలు మరికొందరి ఇళ్లపైనా రెయిడ్
Advertisement
ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బాఘెల్ నివాసంలో బుధవారం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. రాయ్ పూర్, భిలాయ్ లలోని బాఘెల్ నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. బుధవారం ఉదయం సీబీఐ అధికారులు బాఘెల్ ఇంటికి చేరుకున్నారని, ఆయన నివాసాలతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతల ఇళ్లపైనా రెయిడ్ చేశారని బాఘెల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సోదాలకు సంబంధించి అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ విచారణలో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు సమాచారం.

బాఘెల్ ఈ రోజు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా సీబీఐ సోదాలు జరగడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారని బాఘెల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, సీబీఐ దాడులపై కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్ గఢ్ నేత సుశీల్ ఆనంద్ శుక్లా స్పందిస్తూ.. భూపేశ్ బాఘెల్ ను చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. కాంగ్రెస్ పంజాబ్ ఇన్ ఛార్జిగా బాఘెల్ నియామకం జరిగిన తర్వాత బీజేపీ పెద్దలకు భయం మొదలైందన్నారు. బాఘెల్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక విచారణ సంస్థలతో దాడులు చేయిస్తూ నిలువరించే ప్రయత్నం చేస్తోందన్నారు. తొలుత ఈడీ అధికారులను పంపిన కేంద్రం.. తాజాగా సీబీఐ అధికారులను బాఘెల్ నివాసానికి పంపిందన్నారు. అయితే, ఈ దాడులకు బాఘెల్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ భయపడబోదని శుక్లా స్పష్టం చేశారు.
Advertisement
CBI RaidsBhupesh BaghelChhattisgarhCongressMahadeva Betting App ScamBJPRaipurBilaspurSuhail Anand ShuklaED

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more