ఔరంగజేబు సమాధి వివాదంపై స్పందించిన ఆరెస్సెస్

RSS reacts on Aurangzeb grave issue
  • ఔరంగజేబు సమాధి అంశంపై నాగపూర్‌లో ఘర్షణలు
  • ఈ సమాధి నేటికి సంబంధించినది కాదన్న ఆరెస్సెస్
  • హింస సమాజానికి ఏమాత్రం మంచిది కాదన్న ఆరెస్సెస్ 
ఔరంగజేబు సమాధి వివాదంపై రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) స్పందించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి అంశం నాగపూర్‌లో తీవ్ర ఘర్షణలకు దారి తీసిందని, అసలు ఈ సమాధికి సంబంధించిన విషయం ఇప్పుడు అప్రస్తుతం అని పేర్కొంది. ఈ హింస సమాజానికి ఏమాత్రం మంచిది కాదని తెలిపింది. ఈ మేరకు ఆరెస్సెస్ సీనియర్ కార్యకర్త సునీల్ అంబేకర్ ప్రకటన విడుదల చేశారు.

మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై నాగపూర్‌లో రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఔరంగజేబు సమాధి ఉన్న ప్రాంతంలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేసింది. మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్‌లో ఉన్న సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించింది.
Advertisement
Aurangzeb Grave
RSS
Nagpur
Maharashtra

More Telugu News