నాగ్ పూర్ లో అల్లర్లు, కర్ఫ్యూ.. దాడుల వీడియోలు ఇవిగో!
- ఔరంగజేబ్ సమాధి తొలగించాలని హిందూ సంఘాల ఆందోళనలు
- నాగ్ పూర్ లో పరస్పరం దాడులు చేసుకున్న రెండు వర్గాలు
- శాంతియుతంగా ఉండాలంటూ సీఎం ఫడ్నవీస్ పిలుపు
నాగ్ పూర్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ సంఘటనలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఈ అల్లర్లకు సంబంధించి మొత్తం 39 మందిని అరెస్టు చేసినట్లు నాగ్ పూర్ డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. కాగా, వదంతులు నమ్మొద్దని, శాంతియుతంగా ఉండాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్ పూర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నాగ్ పూర్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ నితిన్ గడ్కరీ ట్విట్టర్ లో స్పందించారు. హింసకు పాల్పడ వద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలకు పిలుపునిస్తూ ట్వీట్ చేశారు.