చంద్రబాబునాయుడుకు కొండా సురేఖ లేఖ

Konda Surekha letter to Chandrababu Naidu
  • తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు అంశంపై లేఖ రాసిన మంత్రి
  • సిఫార్సు లేఖలను అనుమతించాలని తీసుకున్న నిర్ణయంపై హర్షం
  • టీటీడీ అధికారులు మీ ఆదేశాలను పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్న సురేఖ
  • మీ ఆదేశాలు పాటించేలా సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల అమలు అంశంపై ఆమె ఈ లేఖ రాశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల అమలుపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సిఫార్సు లేఖలను అనుమతించాలని ఇటీల మీరు తీసుకున్న నిర్ణయం సంతోషాన్ని కలిగించిందని కొండా సురేఖ పేర్కొన్నారు. సిఫార్సు లేఖలపై సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

కానీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని, మీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని మంత్రి తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడానికి తెలంగాణ నుండి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విషయంలో టీటీడీకి వెంటనే సూచనలు ఇవ్వాలని ఆమె కోరారు. సిఫార్సు లేఖల విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Konda Surekha
Telangana
Chandrababu
Tirumala
TTD

More Telugu News