కుంభమేళా నుంచి తీసుకువచ్చిన నీళ్లు తాగేందుకు నిరాకరించిన రాజ్ థాకరే
- కుంభమేళా నుంచి నీటిని తీసుకువచ్చిన ఎంఎన్ఎస్ పార్టీ నేత
- ఆ నీటిని తాగాలని పార్టీ అధినేత రాజ్ థాకరేకు సూచన
- ప్రజలు నీళ్లలో దిగి ఒళ్లు రుద్దుకోవడం చూశాక ఆ నీటిని ఎలా తాగుతామన్న థాకరే
మనం గతంలో కొవిడ్ వంటి మహమ్మారి నుంచి బతికి బయటపడ్డాం. అప్పట్లో మాస్కులు ధరించడం తప్పనిసరిగా ఉండేది. కానీ అలాంటి పరిణామాల నుంచి కూడా మనం ఏమీ నేర్చుకోలేదు. మతపరమైన పుణ్యస్నానాల పేరిట జనాలు పెద్దఎత్తున గుమికూడారు. మతవిశ్వాసాలు అర్థవంతంగా ఉండాలే తప్ప, మూఢనమ్మకాల వెంట ప్రజలు నడవడం సరికాదు. ప్రజలు తప్పనిసరిగా ఆలోచించాలి" అని రాజ్ థాకరే పేర్కొన్నారు.