Delimitation: దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవడానికే... డీలిమిటేషన్: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy talks about Delimitation
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై స్పందించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ప్రాతినిధ్యం అంతంతమాత్రమేనని, ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి దక్షిణాదిన వచ్చింది 29 ఎంపీ స్థానాలేనని అన్నారు. దక్షిణాదిన ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీకి అధికారం లేదని, ఏపీలో కేవలం జూనియర్ భాగస్వామిగానే ఉందని తెలిపారు. అందుకే బీజేపీ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోందని... అందుకు డీలిమిటేషన్ అంశాన్ని వాడుకుంటోందని వివరించారు. 

డీలిమిటేషన్ అమలు జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకే లబ్ధి చేకూరుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కేంద్రం ఆదేశాలతోనే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేశాయని అన్నారు. కేంద్రం మరో 30 ఏళ్ల పాటు డీలిమిటేషన్ ను వాయిదా వేయాలని, అప్పుడు దక్షిణ భారతదేశంలో జనాభా ఏ రీతిలో పెరుగుతుందో చూడాలన్నారు. 

జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వహించిన సదస్సులో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Delimitation
Revanth Reddy
Congress
BJP
Telangana

More Telugu News