ఏపీకి సహకరిస్తున్నారంటూ కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు

06-03-2025 Thu 20:30 | Andhra
Advertisement
  • ఏపీకి కేంద్రమంత్రి సహకరిస్తున్నారన్న చంద్రబాబు
  • మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చలు ఫలప్రదమయ్యాయని వెల్లడి
  • సామాజిక, ఆర్థిక, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చించినట్లు వెల్లడి
Advertisement
కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి... కేంద్రమంత్రితో చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవని అన్నారు. ఈ ప్రాజెక్టులను వెంటనే ఆమోదించి, ఆర్థిక సాయం అందించమని సీఎం కోరారు. 

మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడంలో ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక నోట్‌ను కేంద్రమంత్రికి సమర్పించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజక్టును ఆమోదించారని, విశాఖపట్నం, విజయవాడ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

కీలక పారిశ్రామిక కేంద్రమైన విశాఖపట్నంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తికానుందున, అప్పట్లోగా మెట్రో కారిడార్‌ను జాతీయ రహదారులతో అనుసంధానించడం చాలా ముఖ్యమని తెలిపారు. మొదటి దశలో ప్రధాన పట్టణ కేంద్రాలను అనుసంధానించడం లక్ష్యమని పేర్కొన్నారు. విమానాశ్రయం వరకు విస్తరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. 

రాజధాని అమరావతికి గేట్ వే‌గా విజయవాడ మెట్రో వ్యవస్థ ఏర్పాటుతో ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. విజయవాడ పరిసరాల్లో ఆర్థికవృద్ధికి తోడ్పడటానికి ఇది చాలా అవసరమన్నారు. నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టును ప్రాధాన్యమైనదిగా పరిగణించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటోందని, మెట్రో ప్రాజెక్టులను స్వతహాగా నిర్మించే పరిస్థితుల్లో లేదని అన్నారు.

రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన  ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు 100 శాతం కేంద్ర సహాయాన్ని అందించాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. సకాలంలో ప్రాజెక్టును గ్రౌండ్ చేసేందుకు  ఫేజ్- 1 అనుమతులు, భూసేకరణకు కేంద్రం మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.  ఈ ప్రాజెక్టుల వల్ల వాయు కాలుష్యం తగ్గడమేగాక, ట్రాఫిక్ సమస్య పరిష్కారమై దీర్ఘకాలిక ఆర్థికవృద్ధికి దోహదపడుతుందని కేంద్రమంత్రి ఖట్టర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

'ఎక్స్' వేదికగా ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తున్నందుకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'ఎక్స్' వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రి ఖట్టర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆయన సామాజిక మాధ్యమంలో ఈ విషయాన్ని తెలియజేశారు.

విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చలు ఫలప్రదమయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు. ఇది రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని ఆయన వెల్లడించారు.

విశాఖ పర్యటన ముగిసిన తర్వాత చంద్రబాబునాయుడు నేరుగా ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రితో అరగంటపాటు సమావేశమయ్యారు. చంద్రబాబునాయుడు ఈ రోజు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. 
Advertisement
ChandrababuManohar Lal KhattarAndhra PradeshBJP

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more