ఈ నెల 5, 6 తేదీల్లో మ‌రోసారి ఢిల్లీకి సీఎం చంద్ర‌బాబు
Add ap7am to your home Screen

ఈ నెల 5, 6 తేదీల్లో మ‌రోసారి ఢిల్లీకి సీఎం చంద్ర‌బాబు

CM Nara Chandrababu Naidu Delhi Tour on March 5th and 6th
  • 5న ఉద‌యం గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి ఢిల్లీ ప‌య‌నం
  • ప్ర‌ధాని మోదీతో పాటు ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో సీఎం భేటీ 
  • అదేరోజు రాత్రి ఢిల్లీ నుంచి విశాఖ‌ప‌ట్నంకు తిరుగు ప‌య‌నం
  • 6న ఉద‌యం ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్న సీఎం
  • ఆ రోజు మ‌ధ్యాహ్నం 1.50 గంట‌ల‌కు విశాఖ నుంచి మ‌ళ్లీ ఢిల్లీకి చంద్ర‌బాబు
ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు ఈ నెల 5, 6 తేదీల్లో మ‌రోసారి ఢిల్లీ వెళ్ల‌నున్నారు. 5న ఉద‌యం గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి ఢిల్లీ ప‌య‌న‌మ‌వుతారు. ఆ రోజు ఢిల్లీలో ప్ర‌ధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో ముఖ్య‌మంత్రి భేటీ అవుతారు. అదేరోజు రాత్రి ఢిల్లీ నుంచి విశాఖ‌ప‌ట్నంకు చేరుకుంటారు. 

6వ తారీఖున ఉద‌యం త‌న తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు రచించిన ప్ర‌పంచ చ‌రిత్ర పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఈ కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత మ‌ధ్యాహ్నం 1.50 గంట‌ల‌కు విశాఖ నుంచి మ‌ళ్లీ ఢిల్లీకి వెళ‌తారు. అక్క‌డ వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొని, రాత్రికి అక్క‌డే బ‌స చేస్తారు. 7వ తేదీన అమ‌రావ‌తికి చేరుకుని, వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో జ‌రిగే కేబినెట్ స‌మావేశంలో పాల్గొంటారు. చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. 
Advertisement
Chandrababu
Andhra Pradesh
New Delhi

More Telugu News