భద్రతపై హామీ లేకుండా కాల్పుల విరమణ మాకు ప్రమాదకరం: జెలెన్ స్కీ
Add ap7am to your home Screen

భద్రతపై హామీ లేకుండా కాల్పుల విరమణ మాకు ప్రమాదకరం: జెలెన్ స్కీ

Zelensky talks about war and peace
  • రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం
  • బైడెన్ సర్కారు విధానం వల్లే యుద్ధం ఇంకా కొనసాగుతోందన్న ట్రంప్
  • ట్రంప్ వ్యాఖ్యలతో జెలెన్ స్కీ ఆగ్రహం... సమావేశం నుంచి నిష్క్రమించిన వైనం
  • తాము కోరుకున్నంతగా శాంతిని ఎవరూ కోరుకోవడంలేదని జెలెన్ స్కీ తాజా వ్యాఖ్యలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇన్నాళ్లు సాగడానికి బైడెన్ సర్కారే కారణమని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతోనూ చెప్పారు. మీ వద్ద అమెరికా ఆయుధాలు లేకపోతే రెండు వారాల్లో యుద్ధం ముగిసేదని జెలెన్ స్కీ ముఖంపైనే ట్రంప్ చెప్పడం... జెలెన్ స్కీ తీవ్ర ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్లిపోవడం తాలూకు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

ఈ క్రమంలో జెలెన్ స్కీ తాజా వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోవాలని ట్రంప్ కోరుకుంటున్నారు. మేం కోరుకున్నంత ఎక్కువగా ఎవరూ శాంతిని కోరుకోవడం లేదు. పుతిన్ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం కంటే వృథా పని ఇంకొకటి లేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పుతిన్ గత పదేళ్లలో పాతిక సార్లు ఉల్లంఘించాడు. 

మరి మా భద్రతకు ట్రంప్ హామీ ఇస్తారా? భద్రతపై స్పష్టమైన హామీ లేకుండా కాల్పుల విరమణ మాకు ప్రమాదకరం. మనస్ఫూర్తిగా శాంతిని కోరుకోవడమే సమస్యలకు అసలైన పరిష్కారం. ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటుందనే సందేశాన్ని బలంగా వినిపిస్తాం" అని జెలెన్ స్కీ వివరించారు. 
Advertisement
Volodymyr Zelensky
Ukraine
Russia
Donald Trump
USA

More Telugu News