ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఇంట్రెస్టింగ్ మ్యాచ్... టాస్ గెలిచిన ఆసీస్
- ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆస్ట్రేలియా × ఇంగ్లండ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
- 12 ఓవర్లలో 2 వికెట్లకు 87 పరుగులు చేసిన ఇంగ్లండ్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు 12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 10, వన్ డౌన్ బ్యాట్స్ మన్ జేమీ స్మిత్ 15 పరుగులు చేసి అవుటయ్యారు. ఈ రెండు వికెట్లు డ్వార్షూయిస్ కు దక్కాయి.
ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ బెన్ డకెట్ (27 బ్యాటింగ్), జో రూట్ (22 బ్యాటింగ్) ఉన్నారు.