ప్రియురాలితో జీహెచ్ఎంసీ జేసీ సహజీవనం... పట్టుకుని చితక్కొట్టిన భార్య

GHMC Joint Commissionar Illegal Affair
--
ఉద్యోగం, క్యాంపుల పేరుతో రోజుల తరబడి ఇంటికి రాకుండా బయటే గడిపేస్తున్న భర్తపై నిఘా పెట్టిందో భార్య. దీంతో క్యాంపుల పేరుతో భర్త మరో యువతితో కాపురం పెట్టిన విషయం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న భార్య ఆగ్రహంతో తన పుట్టింటి వాళ్లు, బంధువులను వెంటబెట్టుకుని వెళ్లి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 

ఆపై కోపం పట్టలేక భర్తను, ఆయన ప్రియురాలిని ఎడాపెడా వాయించింది. వెంట వెళ్లిన బంధువులు కూడా తలో చెయ్యి వేయడంతో సదరు భర్త పరిస్థితి దారుణంగా మారింది. 

హైదరాబాద్ లోని వారాసిగూడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే... జీహెచ్ఎంసీలో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్ ఇటీవల ఇంటికి వెళ్లడం తగ్గించాడు.

క్యాంపులు, ఉద్యోగ బాధ్యతలని చెబుతూ ఎక్కువకాలం ఇంటికి దూరంగా ఉంటున్నాడు. దీంతో జానకిరామ్ పై ఆయన భార్య కల్యాణి నిఘా పెట్టింది. దీంతో జానకిరామ్ బండారం బయటపడింది. తనకన్నా ఇరవై ఏళ్లు చిన్నదైన యువతితో జానకిరామ్ వారాసిగూడలో ఏకంగా కాపురమే పెట్టినట్లు తేలింది. దీంతో బంధువులతో కలిసి భార్య కల్యాణి వారాసిగూడలోని జానకిరామ్ ఫ్లాట్ కు వెళ్లింది. ఆ సమయంలో మరో యువతితో రాసలీలల్లో మునిగిన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదింది. ఆపై జానకిరామ్ తో పాటు ఆ యువతిని పోలీసులకు అప్పగించింది.
Go Back to Shorts
Illegal Affair
GHMC
Joint Commissionar
Varasiguda

More Telugu News