Advertisement

విమానంలో చిరంజీవి పెళ్లి రోజు వేడుక.. సురేఖ‌ లాంటి స‌తీమ‌ణి దొర‌క‌డం త‌న అదృష్ట‌మ‌న్న మెగాస్టార్‌

Chiranjeevi Celebrating Wedding Anniversary on Flight
  • దుబాయ్ వెళ్తూ ఫ్లైట్‌లో పెళ్లి రోజును సెల‌బ్రేట్ చేసుకున్న చిరంజీవి దంప‌తులు
  • ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన చిరు
  • నెట్టింట‌ వైర‌ల్‌గా మారిన ఫొటోలు  
మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంప‌తులు త‌మ వివాహ వార్షికోత్స‌వాన్ని విమానంలో ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఫ్లైట్ లో దుబాయ్ వెళ్తూ పెళ్లి రోజును ఇలా సెల‌బ్రేట్ చేసుకున్నారు. అక్కినేని నాగార్జున‌, అమ‌ల‌, న‌మ్ర‌త శిరోద్క‌ర్ త‌దిత‌రులు ఆ విమానంలో ఉన్నారు.  ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను చిరు త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారాయి. 

"దుబాయ్ మార్గమధ్యంలో కొంతమంది ప్రియమైన స్నేహితులతో విమానంలో మా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం. సురేఖ నా కలల జీవిత భాగస్వామి. ఆమె లాంటి స‌తీమ‌ణి దొర‌క‌డం నేను చాలా అదృష్టవంతుడిని అని భావిస్తున్నా. ఆమె నా బలం.  

ఆమె ఉనికి నిరంతరం ఓదార్పునిస్తుంది. అద్భుతమైన ప్రేరణనిస్తుంది. ఆమె నా మోటివేట‌ర్‌. థ్యాంక్యూ సోల్‌మేట్. మీ అద్భుతమైన శుభాకాంక్షల కోసం స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు! ఆశీర్వదించండి!" అంటూ చిరు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్ట్ పెట్టారు.
Advertisement
Chiranjeevi
Wedding Anniversary
Flight
Tollywood

More Telugu News