ఆర్సీ16 దర్శకుడు బుచ్చిబాబు బర్త్ డే సెలబ్రేట్ చేసిన టీమ్... ఫొటోలు ఇవిగో!
కాగా, రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న చిత్రం ఓ స్పోర్ట్స్ ఓరియెంటెడ్ మూవీ. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.
ఆర్సీ16కి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండడం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. కాగా, ఈ సినిమా కోసం పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

