రెండో వన్డే: టాస్ గెలిచిన ఇంగ్లండ్... టీమిండియాకు బౌలింగ్
- టీమిండియా, ఇంగ్లండ్ మధ్య 3 వన్డేల సిరీస్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- మోకాలి నొప్పి నుంచి కోలుకుని నేటి మ్యాచ్ లో ఆడుతున్న కోహ్లీ
మోకాలి నొప్పితో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఆడుతుండడం టీమిండియాకు సానుకూలాంశం. కోహ్లీ జట్టులోకి రావడంతో యశస్వి జైస్వాల్ ను తప్పించారు. ఈ మ్యాచ్ ద్వారా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఆరంగేట్రం చేస్తున్నాడు.
ఈ సిరీస్ లో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించడం తెలిసిందే. ఇవాళ్టి రెండో వన్డే కూడా గెలిస్తే సిరీస్ టీమిండియా వశమవుతుంది.