తాడేపల్లిలో జగన్ ఇంటి సమీపంలో వరుస అగ్నిప్రమాదాలపై దర్యాప్తు!

Probe on fire accidents near Jagan residence in Tadepalli
  • రెండ్రోజుల కిందట తాడేపల్లిలో అగ్నిప్రమాదాలు
  • మధ్యాహ్నం ఓసారి, రాత్రి మరోసారి అగ్నిప్రమాదాలు
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు 
తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం సమీపంలో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు. రెండ్రోజుల కిందట మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి... అదే రోజు రాత్రి 8 గంటలకు మరోసారి అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 

జగన్ నివాసం సమీపంలో ఈ అగ్నిప్రమాదాలు జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. తాజాగా, ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు.
Go Back to Shorts
Fire Accident
Jagan
Tadepalli
Police

More Telugu News