తిరుపతి - చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి మృతి

03-02-2025 Mon 06:50 | Andhra
Advertisement
  • వివాహ కార్యక్రమానికి హజరై తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
  • సీతారామపురం గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులతో పాటు మరో ఇద్దరి మృతి 
  • నగరి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
Advertisement
వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన చిత్తూరు జిల్లా నగరి పట్టణ సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.  

తిరుపతి జిల్లా వడమాలపేట మండలం సీతారామపురం గ్రామానికి చెందిన వారు, తమిళనాడు రాష్ట్రం తిరుత్తణిలో జరిగిన వివాహానికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నగరి సమీపంలో బస్సు డ్రైవర్ ఒక వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో పుత్తూరు నుంచి ఎదురుగా వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో సీతారామపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పార్థసారథి నాయుడు (70), రాజేంద్ర నాయుడు (65), తిరుపతికి చెందిన ధనుశ్ (10), తిరుత్తణికి చెందిన కుమార్ (55) మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా తిరుపతి - చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. 
Advertisement
Road AccidentChittoor DistrictAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more