శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్
- బాంబులతో పేల్చేస్తానంటూ బెదిరించిన దుండగుడు
- గురువారం తెల్లవారుజామున ఫోన్ కాల్
- దుండగుడిని కామారెడ్డి జిల్లాకు చెందిన యువకుడిగా గుర్తించి అరెస్టు
పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు.. ఫోన్ చేసిన దుండగుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాఫ్తులో కామారెడ్డి జిల్లాకు చెందిన నితిన్ అనే యువకుడు ఈ బెదిరింపు ఫోన్ కాల్ చేశాడని గుర్తించారు. నితిన్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అతడికి మతిస్థిమితం లేదని తేలింది. దీంతో నితిన్ కుటుంబ సభ్యులను పిలిపించి అతడిని అప్పగించారు.