మ‌హా కుంభమేళాకు ఏపీఎస్ఆర్‌టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు.. ఎప్ప‌ట్నుంచంటే..!

28-01-2025 Tue 11:42 | Andhra
Advertisement
  • విజ‌య‌వాడ నుంచి మ‌హా కుంభమేళాకు ప్ర‌త్యేక బ‌స్సుల ఏర్పాటు
  • ఈ యాత్రలో ప్ర‌యాగ‌రాజ్‌తో పాటు వార‌ణాసి, అయోధ్య పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకునేలా ప్లాన్‌
  • మొత్తం 8 రోజుల యాత్ర‌.. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 8 వ‌ర‌కు యాత్ర షెడ్యూల్ 
  • ఈ బ‌స్సుల్లో పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు ఒకేలా ఛార్జీలు
Advertisement
యూపీలోని ప్ర‌యాగ‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హా కుంభమేళాకు ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నున్న‌ట్లు ఏపీఎస్ఆర్‌టీసీ   ప్ర‌క‌టించింది. విజ‌య‌వాడ నుంచి ఈ ప్ర‌త్యేక బ‌స్సులను ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా ప్రజార‌వాణా అధికారి ఎంవై దానం సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 

ఇక ఈ యాత్రలో ప్ర‌యాగ‌రాజ్‌తో పాటు వార‌ణాసి, అయోధ్య పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకునేలా రానుపోను దాదాపు 3,600 కిలోమీట‌ర్లు, మొత్తం 8 రోజుల యాత్ర‌ను ప్లాన్ చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 8వ తేదీ వ‌ర‌కు యాత్రను షెడ్యూల్ చేశారు. 

  • ఫిబ్ర‌వ‌రి 1న ఉద‌యం విజ‌య‌వాడ పీఎన్‌బీఎస్ నుంచి ప్ర‌త్యేక బ‌స్సులు బ‌య‌ల్దేరుతాయి.
  • 2న సాయంత్రం ప్ర‌యాగ‌రాజ్‌కు చేరుకుంటాయి.
  • 3న ప్ర‌యాగ‌రాజ్‌లోనే బ‌స చేయ‌డం జ‌రుగుతుంది.
  • 4న రాత్రి నుంచి అయోధ్య‌కు ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది.
  • 5న ఉద‌యం అయోధ్య‌కు చేరుకుని, బాల రాముడి ద‌ర్శ‌నం అనంతరం రాత్రికి కాశీకి ప్రయాణం
  • 6న వార‌ణాసికి చేరుకుని రాత్రికి అక్క‌డే బ‌స ఉంటుంది. 
  • 7న ఉద‌యం వార‌ణాసి నుంచి బ‌స్సులు బ‌య‌ల్దేరుతాయి.
  • 8న బ‌స్సులు విజ‌య‌వాడ‌కు చేరుకుంటాయి.

ఈ యాత్ర ప్ర‌త్యేక బ‌స్సుల్లో ఛార్జీలు ఇలా..

సూప‌ర్ ల‌గ్జ‌రీ- రూ.8వేలు
స్టార్ లైన‌ర్ నాన్ ఏసీ స్లీప‌ర్‌- రూ.11వేలు
వెన్నెల ఏసీ స్లీప‌ర్‌- రూ.14,500


ఈ యాత్ర ప్ర‌త్యేక బ‌స్సుల్లో ఛార్జీలు పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు ఒకేలా ఉంటాయ‌ని ఆర్‌టీసీ అధికారులు వెల్ల‌డించారు. అలాగే త‌మ‌కు ఇచ్చేది కేవ‌లం బ‌స్సు ఛార్జీలు మాత్ర‌మేన‌ని తెలిపారు. భోజ‌నం, వ‌స‌తి, ఇత‌ర ఖ‌ర్చుల‌ను ప్ర‌యాణికులే భ‌రించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక యాత్రకు వెళ్ల‌ద‌ల‌చిన వారు 35, 29 మంది భ‌క్తులు స‌మూహంగా వ‌స్తే ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేస్తామ‌న్నారు. 

అలాగే ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ కోసం ఆన్‌లైన్‌, ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్లు, స‌మీప బస్ స్టేష‌న్ల‌లో సంప్ర‌దించాల‌ని సూచించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు 8074298487, 0866 2523926, 0866 2523928 నంబ‌ర్ల‌కు ఫోన్‌ చేసి తెలుసుకోవ‌చ్చ‌ని తెలిపారు.   

కాగా, ఇప్ప‌టికే రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, కొవ్వూరు నుంచి బ‌స్సులు ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు చెప్పారు. వాటిల్లో రిజ‌ర్వేష‌న్లు కూడా పూర్తయిన‌ట్లు పేర్కొన్నారు. ఇవి కూడా ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచే బ‌య‌ల్దేరుతాయ‌ని ఆర్‌టీసీ అధికారులు వెల్ల‌డించారు. 
Advertisement
APSRTCMaha Kumbh Mela 2025Andhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more