వయనాడ్ మ్యాన్ ఈటర్ పులికి పోస్టుమార్టం... పొట్టలో చెవిరింగులు, మహిళ దుస్తులు
Add ap7am to your home Screen

వయనాడ్ మ్యాన్ ఈటర్ పులికి పోస్టుమార్టం... పొట్టలో చెవిరింగులు, మహిళ దుస్తులు

Wayanad man eater tiger died in unusual circumstances
  • వయనాడ్ జిల్లాలో హడలెత్తించిన పెద్ద పులి
  • మ్యాన్ ఈటర్ గా ప్రకటించిన కేరళ ప్రభుత్వం
  • చంపేసేందుకు ఆదేశాలు
  • అనూహ్య రీతిలో ఓ ఇంటి వెనుక చనిపోయి కనిపించిన పులి
  • మరో క్రూరమృగం దాడిలో మరణించి ఉంటుందన్న అధికారులు
కేరళలోని వయనాడ్ జిల్లాలో అందరినీ హడలెత్తించిన మ్యాన్ ఈటర్ పెద్ద పులి ఎట్టకేలకు మరణించింది. ఇటీవల మనంతవాడి ప్రాంతంలో ఓ కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ అనే కార్మికురాలిపై పులి దాడి చేసి, సగం తినేసింది. ఓ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారిపైనా ఆ పులి పంజా విసిరింది. 

పులి కారణంగా ఆ ప్రాంతంలోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దాంతో, ప్రభుత్వం ఈ పులిని మ్యాన్ ఈటర్ గా ప్రకటించి, చంపేసేందుకు ఆదేశాలిచ్చింది. 

అయితే, ఎవరూ ఊహించని రీతిలో పిలకావు ప్రాంతంలో ఓ పాడుపడిన ఇంటి వెనుక ఆ పులి చనిపోయి కనిపించింది. ఆ పులిపై ఉన్న గాయాల ఆధారంగా, మరో క్రూరమృగం దాడిలో ఆ పులి మరణించి ఉంటుందని అంచనాకు వచ్చారు. 

కాగా, ఆ మ్యాన్ ఈటర్ పులికి పోస్టుమార్టం నిర్వహించగా... ఆ పులి పొట్టలో చెవిరింగులు, మహిళ దుస్తులు కనిపించాయి. అవి ఇటీవల పులిదాడిలో మరణించిన రాధ అనే మహిళవని గుర్తించారు.
Advertisement
Man Eater Tiger
Wayanad
Kerala

More Telugu News