ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత యానిక్ సిన్నర్... ఫైనల్లో జ్వెరెవ్ ఓటమి
- ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్
- వరుస సెట్లలో జ్వెరెవ్ ను చిత్తు చేసిన సిన్నర్
- వరుసగా రెండో ఏడాది కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం
సెమీఫైనల్లో లెజెండరీ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ గాయంతో వాకోవర్ ఇవ్వడంతో ఫైనల్ చేరిన జర్మనీ ఆటగాడు జ్వెరెవ్... డిఫెండింగ్ చాంపియన్ సిన్నర్ ముందు ఏమాత్రం నిలవలేకపోయాడు. జ్వెరెవ్ రెండో సెట్ లో మాత్రం కాస్తంత పోటీ ఇచ్చినా, టైబ్రేకర్ లో ఆ సెట్ ను చేజార్చుకున్నాడు.
కాగా, సిన్నర్ కు ఇది వరుసగా రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. గతేడాది కూడా ఇక్కడ పురుషుల సింగిల్స్ టైటిల్ ను సిన్నరే గెలిచాడు. అంతేకాదు, అమెరికా లెజెండ్ జిమ్ కొరియర్ తర్వాత వరుసగా రెండు పర్యాయాలు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన పిన్న వయస్కుడిగా 23 ఏళ్ల సిన్నర్ ఘనత నమోదు చేశాడు.
ఓవరాల్ కు సిన్నర్ కు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. గతేడాది యూఎస్ ఓపెన్ లోనూ సిన్నర్ విజేతగా నిలిచాడు.