సింగపూర్ కాన్సుల్ జనరల్ తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం
- పవన్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన సింగపూర్ దౌత్యాధికారులు
- పవన్ తో మర్యాదపూర్వక భేటీ
- ఏపీ-సింగపూర్ సంబంధాల బలోపేతంగా దిశగా సమావేశం
ఈ భేటీపై సింగపూర్ దౌత్య కార్యాలయం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. విజయవాడలో ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొంది. సింగపూర్-ఆంధ్రప్రదేశ్ మధ్య సుదీర్ఘ మైత్రి ఉందని వెల్లడించింది. ఏపీ-సింగపూర్ సంబంధాల బలోపేతం దిశగా ఈ సమావేశం జరగడం అభినందనీయమని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ పేర్కొన్నారు.

