bhawanapadu: ఆర్సెలార్ మిత్తల్ చైర్మన్ లక్ష్మీమిత్తల్‌తో చంద్రబాబు, లోకేశ్ భేటీ

set up a petrochemical hub in bhawanapadu nara lokesh asks lakshmi mittal
షార్ట్స్‌లో చూడండి
దావోస్‌ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్‌లు సోమవారం ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీమిత్తల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటు పెట్టుబడులకు లోకేశ్.. లక్ష్మీ మిత్తల్‌ను ఆహ్వానించారు. పెట్రో కెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని చెప్పారు. అలాగే ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 

హెచ్‌పీసీఎల్ – మిత్తల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.3,500 కోట్లతో 2 జి డబ్ల్యు సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను భారత్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే ఈ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. సుమారు 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే ఈ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 
 
 
Go Back to Shorts
bhawanapadu
petrochemical hub
Nara Lokesh
Chandrababu
Davos
lakshmi mittal

More Telugu News