నా ప్రియ మిత్రుడు ట్రంప్ కు శుభాకాంక్షలు: మోదీ
- అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్
- ట్రంప్ తో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నానన్న మోదీ
- మీ పదవీకాలం విజయవంతంగా కొనసాగాలంటూ ట్వీట్
మరోవైపు ట్రంప్ కు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నా ప్రియమిత్రుడు ట్రంప్ కు శుభాకాంక్షలు. భారత్- అమెరికా దేశాల మధ్య ప్రయోజనాల కోసం, ప్రపంచానికి మంచి భవిష్యత్తు కోసం మరోసారి మీతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నా. అమెరికా అధ్యక్షుడిగా మీ పదవీకాలం విజయవంతంగా కొనసాగాలి' అని ట్వీట్ చేశారు.