కుంభమేళా ‘మోనాలిసా’ను ఇంటికి పంపించేసిన తండ్రి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుంభమేళా ‘మోనాలిసా’ను ఇంటికి పంపించేసిన తండ్రి!

Maha Kumbh 2025 Ki Mona Lisa Sent Back To Indore
  • కుంభమేళాలో దండలు విక్రయించే మోనాలిసా భోస్లే
  • రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్షేషన్‌గా మారిన బ్యూటీ
  • కొనేది తక్కువ, ఫొటోలు వీడియోలు తీసుకునే వారు ఎక్కువ కావడంతో తండ్రి అప్‌సెట్
  • తిరిగి ఇండోర్‌లోని ఇంటికి పంపించిన వైనం
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో సోషల్ మీడియాకెక్కిన దండలు విక్రయించే యువతి మోనాలిసాను ఆమె తండ్రి ఇండోర్‌లోని ఇంటికి పంపించేశాడు. ఇంటర్నెట్‌లో ఆమెకు పేరు ప్రఖ్యాతులు లభించి వైరల్ అయిన తర్వాత అమ్మకాలు తగ్గిపోవడం, వచ్చేవారు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు మాత్రమే పరిమితం అవుతుండటంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ విషయాన్ని సచిన్ గుప్తా అనే సోషల్ మీడియా యూజర్ ఎక్స్ ద్వారా వెల్లడించాడు. ఇండోర్ ‘మోనాలిసా’ తిరిగి ఇంటికి చేరుకుందని పేర్కొన్నాడు. కొంతమంది మాత్రమే ఆమె విక్రయించే దండలు కొంటూ, ఎక్కువమంది ఆమెతో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో ఆమె తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాడు.

నెటిజన్లు ముద్దుగా ‘బ్రౌన్ బ్యూటీ’గా పిలుచుకుంటున్న మోనాలిసా భోస్లే తన అమాయకపు చూపు, ముగ్ధమనోహరమైన రూపంతో ఇంటర్నెట్‌ను కట్టిపడేసింది. నీలి రంగు కళ్లతో కుంభమేళాకు వచ్చిన వారిని ఆకర్షించింది. ఈ క్రమంలో ఆమె వీడియో ఒకటి అనుకోకుండా సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. అది ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. 

ఆమె స్వచ్ఛమైన చిరునవ్వు, అమాయకత్వం లక్షల మందిని ఆకర్షించింది. దీంతో ఇంటర్నెట్‌లో ఓవర్‌నైట్ సెన్షేషన్‌గా మారింది. అయితే, అదే ఆమె వ్యాపారాన్ని దెబ్బతీసింది. కుంభమేళాకు వచ్చిన వారు, యూట్యూబర్లు ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. దీంతో ఆమె వ్యాపారం దెబ్బతింది. గమనించిన తండ్రి ఇలా అయితే లాభం లేదని ఆమెను తిరిగి మధ్యప్రదేశ్‌, ఇండోర్‌లోని ఇంటికి పంపించేశాడు. 
Advertisement
Monalisa
Maha Kumbh
Prayagraj
Indore

More Telugu News