ఏపీకి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ.. హెచ్125 హెలికాప్టర్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న ‘ఎయిర్‌బస్?’

19-01-2025 Sun 09:47 | Andhra
Advertisement
  • ఇండియా ‘హెచ్ 125‘ హెలికాప్టర్లు ఉత్పత్తి చేయాలని నిర్ణయించిన ఎయిర్‌బస్ సంస్థ
  • కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పరిశీలన
  • అనంతపురాన్ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం
  • భూ కేటాయంపుల కోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం
Advertisement
ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ తరలివస్తోంది! రాష్ట్రంలో హెచ్125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విమానాల తయారీ సంస్థ ‘ఎయిర్‌బస్’ నిర్ణయించినట్టు తెలిసింది. ఫ్రాన్స్‌కు చెందిన ఈ సంస్థ భారత్‌లో హెలికాప్టర్లు తయారు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ రాష్ట్రాలతో సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ను తమకు అనువైన రాష్ట్రంగా ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. కియా కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన అనంతపురాన్నే ఇందుకు అనువైనదిగా భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపిందని, హెలికాప్టర్ల తయారీ యూనిట్ కోసం అనువైన స్థలాన్ని కేటాయించాలంటూ జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కూడా అందినట్టు చెప్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

‘హెచ్125’ అనేది సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్. ఇందులో గరిష్ఠంగా ఆరుగురు ప్రయాణించవచ్చు. పర్యాటకంగానూ దీనిని ఉపయోగించుకోవచ్చు. అలాగే, సరిహద్దుల్లో పహారా, విపత్తుల సమయంలో సహాయక చర్యలకు ఇది పూర్తి అనువుగా ఉంటుంది. గరిష్ఠంగా గంటకు 289 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న హెలికాప్టర్ కూడా ఇదే. దీనికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇండియాలో ఈ హెలికాప్టర్‌ను ఉత్పత్తి చేయాలని ఎయిర్‌బస్ భావిస్తోంది. 
Advertisement
AirbusH125 HelicopterAndhra PradeshAnantapur

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more