పుస్తకాల బరువు తగ్గించండి... నాణ్యత పెంచండి!: నారా లోకేశ్

07-01-2025 Tue 20:38 | Andhra
Advertisement
  • స్కూలు, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి లోకేశ్ సమీక్ష
  • ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలపై చర్చ
  • ఉన్నత విద్యలో క్యూఎస్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా మార్పులు
  • కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యప్రణాళిక ప్రక్షాళనకు కసరత్తు
Advertisement
పాఠశాల విద్య స్థాయిలో బాలలకు పుస్తకాల భారం తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. 2025-26 విద్యాసంవత్సరంలో కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యప్రణాళిక సమూల ప్రక్షాళనపై పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖాధికారులతో మంత్రి లోకేశ్ ఉండవల్లి నివాసంలో 4 గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్షించారు.

ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు చేపట్టాలని అన్నారు. స్కూలు ఎడ్యుకేషన్ లో జీవో నెం. 117కు ప్రత్యామ్నాయం విషయంలో ఎమ్మెల్యేలు, స్కూలు మేనేజ్ మెంట్ కమిటీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్లేస్కూలు పాలసీపై కూడా సమావేశంలో చర్చసాగింది. 

పాఠ్యాంశాల్లో నైతికవిలువల అంశాలను ప్రవేశపెట్టడంతోపాటు సెమిస్టర్ వైజ్ గా వేర్వేరు టెక్స్ట్ బుక్స్ కాకుండా ఒకే పుస్తకాలు రెండుసెమిస్టర్ల పాఠ్యాంశాలు ఉండేలా రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. దీనివల్ల పాఠశాల విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించవచ్చని సూచించారు. ఎటువంటి విమర్శలకు తావీయకుండా పారదర్శకంగా డిఎస్సీని నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో విధివిధానాలపై సమావేశంలో చర్చించారు.

 క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా ఫ్రేమ్ వర్క్ 

యూనివర్సిటీల్లో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా క్రెడిట్ ఫ్రేమ్ వర్క్, ఇంటర్న్ షిప్ లు ఉండాలని చెప్పారు. యూనివర్సిటీల వీసీల నియామకంలో అకడమిక్ ఎచీవ్ మెంట్స్, కరిక్యులమ్ డెవలప్ మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ స్ట్రాటజీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 

అదేవిధంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పాటయ్యే అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యుల ఎంపికలో విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్టేక్ హోల్డర్లు, పాలసీ ఎక్స్ పర్ట్స్, రీసెర్చి నిపుణులకు స్థానం కల్పించాలన్నారు. వీసీలు, అడ్వయిజరీ కౌన్సిల్ నియామకాలను మార్చి నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 

కరిక్యులమ్ రీస్ట్రక్చర్ సమయంలో సమర్థ్ ప్లాట్ ఫాం సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వర్సిటీల్లో హాస్టళ్ల పనితీరును మెరుగుపర్చేందుకు వెబ్ బేస్డ్ మెనూ, సజెషన్ బాక్సులను ఏర్పాటు చేయాలని అన్నారు. యూనివర్సిటీల్లో ప్రస్తుతం 36 శాతంగా ఉన్న గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియను 50 శాతానికి పెంచేలా చర్యలు చేపట్టాలని, చెలెనింగ్ స్కాలర్ షిప్ ల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి విద్యార్థులను ఎంపికచేయాలని అన్నారు.

మ్యాథ్స్ లో ఒకే పేపర్... బాటనీ, జువాలజీ కలిపి ఒకే పేపర్

ఇంటర్మీడియట్ లో అకడమిక్ రోడ్ మ్యాప్, రివైజ్డ్ సిలబస్ – టెక్స్ట్ బుక్స్, అకడమిక్ క్యాలండర్ రూపకల్పన న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్, మార్కింగ్ ప్యాట్రన్ పై మంత్రి లోకేష్ సమీక్షించారు. ఇంటర్మీడియట్ విద్యలో గత పదేళ్లుగా ఎటువంటి సంస్కరణలు చేపట్టలేదన్నారు. మ్యాథ్స్ లో ఒకే పేపర్, బాటనీ, జువాలజీలు కలిపి ఒకే పేపర్ ఉండేలా మార్పులు చేయడంపై చర్చ సాగింది. 

అదేవిధంగా సీబీఎస్ఈలో మాదిరి ఇంటర్నల్ మార్కుల విధానం అమలుపై చర్చించారు. అదేవిధంగా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ను జనవరికల్లా పూర్తిచేసేలా క్యాలండర్ రూపొందించాలన్నారు. సంస్కరణలు తెచ్చేటప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటుచేసి విద్యారంగ నిపుణులు, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. 

Advertisement
Nara LokeshAP Model School EducationTDP-JanaSena-BJP AllianceAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more