తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: ఛార్మీ
- టాలీవుడ్ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ
- తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతో పనిచేస్తోందన్న ఛార్మీ
- వారి విజనరీ నాయకత్వం అభినందనీయం అంటూ ట్వీట్
- కలసికట్టుగా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేద్దామంటూ పిలుపు
"ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సినీ పరిశ్రమకు, సమాజానికి లబ్ధి చేకూర్చే సంక్షేమ కార్యక్రమాల పట్ల చైతన్యం కలిగించేందుకు మనస్ఫూర్తిగా తోడ్పాటు అందిస్తాను. కీలకమైన సామాజిక సమస్యలపై అవగాహన కలిగించేందుకు కట్టుబడి ఉంటాను. చిత్ర పరిశ్రమ ఉజ్వల భవిష్యత్తుకు కలసికట్టుగా కృషి చేద్దాం" అని ఛార్మీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.